‘హిట్-3’లో మృదుల పాత్రలో శ్రీనిధి శెట్టి

‘హిట్-3’లో మృదుల పాత్రలో శ్రీనిధి శెట్టి

Published on Oct 21, 2024 10:36 PM IST

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రానుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఇక నేడు ఆమె పుట్టినరోజు కావడంతో, ‘హిట్-3’ చిత్ర యూనిట్ ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనిధి శెట్టికి సంబంధించి ఓ కొత్త పోస్టర్‌ను రివీల్ చేశారు. అంతేగాక, ఈ సినిమాలో ఆమె పాత్ర పేరును కూడా వారు రివీల్ చేశారు.

‘హిట్-3’ చిత్రంలో మృదుల అనే పాత్రలో శ్రీనిధి శెట్టి నటిస్తోంది. అర్జున్ సర్కార్ అనే పాత్రలో నాని నటిస్తున్నాడు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా 2025 మే 1న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు