ఆకట్టుకుంటున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సరికొత్త పోస్టర్!

ఆకట్టుకుంటున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సరికొత్త పోస్టర్!

Published on Jan 1, 2024 4:15 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రాన్ని మార్చ్ 8, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్త సంవత్సరం సందర్భం గా మేకర్స్ నేడు సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు.

పోస్టర్ లో హీరో విశ్వక్ సేన్, ఆ ఊరి పెద్ద తో దిగిన ఫోటో ను చూపించారు. పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది. నేహ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు