పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ లుక్ ఇప్పటి వరకూ కూడా రిలీజ్ కాలేదు. సెప్టెంబర్ 2 న పవర్ స్టార్ పుట్టిన రోజు కావడం తో మేకర్స్ గ్లింప్స్/ టీజర్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ వీడియో పై మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఫస్ట్ లుక్ లేదు అని, ఆకలితో ఉన్న చిరుత కోసం ఎదురు చూద్దాం అంటూ చెప్పుకొచ్చారు. డైరెక్ట్ గా టీజర్ ను రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలీజ్ అయిన ప్రీ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. పిస్టల్ పట్టుకున్న చేతికి డ్రాగన్ టాటూ ఉంది. టీజర్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ సిద్దం అయినట్లు తెలుస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.