సరికొత్త రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రవితేజ “మిరపకాయ్”

సరికొత్త రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రవితేజ “మిరపకాయ్”

Published on Feb 19, 2023 6:00 PM IST

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తాను నటించిన ధమాకా గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో అతని పాత్రకు భారీ ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఈ నటుడి మరో సినిమా నేడు వార్తల్లో నిలిచింది. రవితేజ సూపర్ హిట్ మూవీ మిరపకాయ్ జనవరి 26, 2023న రీ రిలీజ్ కావాల్సి ఉండగా, కొన్ని సమస్యల కారణంగా వాయిదా పడింది.

ఈరోజు, హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 24, 2023న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. సునీల్, చంద్ర మోహన్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు మరియు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ మరియు దీక్షా సేథ్ కథానాయికలు గా నటించారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు