“పుష్పరాజ్” మాస్ లుక్ తో సరికొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

“పుష్పరాజ్” మాస్ లుక్ తో సరికొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Jun 17, 2024 8:40 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం ను ఆగస్ట్ 15, 2024 న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. సరికొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడం జరిగింది.

ఈ చిత్రం ను డిసెంబర్ 6, 2024 న భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. పోస్టర్ లో అల్లు అర్జున్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పుష్పరాజ్ మాస్ స్వాగ్ ఇందులో డబుల్ ఎనర్జీ తో ఉండనుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో ఫహాద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు