ఓటీటీలపై ప్రభుత్వం కఠిన నిబంధనలు

ఓటీటీలపై ప్రభుత్వం కఠిన నిబంధనలు

Published on Feb 25, 2021 9:03 PM IST

మన దేశంలో సోషల్ మీడియా వినియోగం మీద ఈమధ్య కాలంలో చాలా వివాదాలే చెలరేగాయి. సోషల్ మీడియా సంస్థల యాజమానులకు, ప్రభుత్వానికి నడుమ అనేక విబేధాలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. సోషల్ మీడియాతో పాటు ఓటీటీ రంగం మీద కూడ నూతన నిబంధనలను వర్తింపజేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఓటీటీ కంటెంట్ వీక్షణకు పలు స్వీయ నియంత్రణ షరతులు విధించింది. ఓటీటీ, డిజిటల్ న్యూస్‌ మాధ్యమాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి వెల్లడించాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ తేల్చి చేప్పారు.

అలాగే ఓటీటీల్లో కంటెంట్‌కు సంబంధించి 7+, 13+, 16+, ఏ కేటగిరీలతో స్వీయ వర్గీకరణలు ఉండాలని, 13+ వారికి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో లాకింగ్ ఉండాలి. వారికి తెలియకుండా పిల్లలు ఆ లాక్‌ను తెరిచే వీలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నిటికీ మించి సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి లేదా ఈ విభాగంలో ప్రముఖ వ్యక్తి నేతృత్వంలోని స్వీయ నియంత్రణ సంస్థ ఉండాలని తెలిపారు. ఓటీటీల వినియోగం, స్మార్ట్ ఫోన్ల వాడకం అనూహ్య రీతిలో పెరిగిన నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఈ ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు