ఎన్టీఆర్ సినిమా పై కొత్త రూమర్ !

Published on Jul 5, 2020 1:03 am IST

జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని, అలాగే ఈ చిత్రంలో మలయాళీ స్టార్ మోహన్ లాల్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక రాజకీయ పాత్రను రాస్తున్నాడని సోషల్ మీడియాలో ఒక ఇంట్రస్టింగ్ రూమర్ ఒకటి బాగా హల్ చల్ చేస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే త్రివిక్రమ్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చేదాకా ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాలోని ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ ఫీల్ అవుతున్నారట. మరో కథానాయికగా పూజా హేగ్దేను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నికుదిరితే డిసెంబర్ నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పెడుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

సంబంధిత సమాచారం :

More