సీనియర్ హీరోయిన్ తమన్నా పెళ్లి పై ఎప్పుడూ ఏవో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే, తన వ్యక్తిగత ఒంటరి జీవితానికి శుభం కార్డు పలుకుతూ త్వరలోనే తమన్నా వివాహం చేసుకోబోతుందని తాజాగా మళ్ళీ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. నిజానికి తమన్నా పెళ్లి పై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకసార్లు గాసిప్స్ వచ్చాయి. తమన్నా వయస్సు ప్రస్తుతం 32 సంవత్సరాలు. అందుకే, కొన్ని రోజుల క్రితమే తమన్నా పెళ్లికి ఓకే చెప్పిందట.
ఈ క్రమంలో తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త తో తమన్నా పెళ్లి ఫిక్స్ అయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐతే, ఈ వార్తల పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి తమన్నా నుంచి ఆమె పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తోందేమో చూడాలి. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్గా తమన్నా కొనసాగింది.