‘విశ్వంభర’ ఎంట్రీ సీన్ అదే

‘విశ్వంభర’ ఎంట్రీ సీన్ అదే

Published on Mar 12, 2024 1:02 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఐతే, ఈ చిత్రం ఎంట్రీ సీన్ పై ఓ రూమర్ వినిపిస్తోంది. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో సాగే ఈ సోషియో ఫాంటసీ సినిమా ఓపెనింగ్ సీన్ ఓ దివిలో జరిగే యాక్షన్ ఎపిసోడ్ తో స్టార్ట్ అవుతుందని..మెగాస్టార్ చిరంజీవి వెరీ పవర్ ఫుల్ మ్యాన్ గా ఎంట్రీ ఇస్తారని టాక్ నడుస్తోంది.

అన్నట్టు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా రీసెంట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుంది అని, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుంది అని వశిష్ట చెప్పుకొచ్చాడు. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు