“పుష్ప 2” రిలీజ్ పై కొత్త రూమర్స్.!

“పుష్ప 2” రిలీజ్ పై కొత్త రూమర్స్.!

Published on Jul 27, 2024 3:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి అవైటెడ్ సీక్వెల్స్ లో ఒకటిగా పుష్ప 2 పై సెన్సేషనల్ హైప్ ఉంది. అయితే ఈ చిత్రం రిలీజ్ విషయంలో మంచి సస్పెన్స్ ఇప్పుడు నడుస్తుంది. ఎపుడో ఆగస్ట్ టార్గెట్ అంటూ డేట్ ని లాక్ చేసి దానిని మళ్ళీ డిసెంబర్ రిలీజ్ అంటూ మార్చారు.

మరి ఇప్పుడు ఈ రిలీజ్ విషయంలో కూడా సరికొత్త రూమర్స్ మొదలయ్యాయి. దీంతో పుష్ప 2 మరోసారి వాయిదా పడింది అంటూ కొన్ని ఊహాగానాలు వైరల్ గా మారాయి. ఈసారి సినిమా డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది వేసవికి షిఫ్ట్ అయ్యింది అంటూ వినిపిస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే షూటింగ్ మళ్ళీ మొదలై శరవేగంగా పూర్తవుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అంటే నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు ఆగి చూడాల్సిందే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు