‘ఉస్తాద్’ విషయంలో హరీష్ శంకర్‌కు టెన్షన్..?

‘ఉస్తాద్’ విషయంలో హరీష్ శంకర్‌కు టెన్షన్..?

Published on Dec 31, 2024 8:00 AM IST

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్‌లో దర్శకుడు హరీష్ శంకర్ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయన తెరకెక్కించే సినిమాలు పక్కా కమర్షియల్ మూవీస్ అయినా, బాక్సాఫీస్ దగ్గర ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడంలో ఆయన సక్సెస్ సాధించాడు. అయితే ఆయన నుండి వచ్చిన లాస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

కానీ, ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ తరువాత దారుణమైన రిజల్ట్‌ను అందుకుంది. భారీ డిజాస్టర్‌గా ఈ చిత్రం నిలవడంతో హరీష్ శంకర్‌పై ఇప్పుడు తీవ్ర ఒత్తిడి క్రియేట్ అయ్యింది. ఇది హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమాలపై కూడా ఉండబోతుంది. ఇప్పటికే హరీష్ తన నెక్స్ట్ చిత్రంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా తమిళ్ మూవీ ‘తేరి’కి రీమేక్ అనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

దీంతో ఇప్పుడు అసలైన టెన్షన్ హరీష్ శంకర్‌ను వెంటాడుతోంది. ‘తేరి’ సినిమా ఇప్పటికే తెలుగులో ‘పోలీసోడు’ అనే టైటిల్‌తో అందుబాటులో ఉంది. ఇక రీసెంట్‌గా ‘బేబీ జాన్’గా హిందీలోనూ రీమేక్ అయ్యింది. అయితే బాలీవుడ్‌లో ఈ మూవీ రిజల్ట్ మనం చూశాం. దీంతో ఇప్పుడు పవన్ కోసం హరీష్ శంకర్ ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నాడా.. ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఎలాంటి కమర్షియల్ హంగులు అద్దుతున్నాడా.. అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరి హరీష్ శంకర్ ఈ టెన్షన్స్ అన్నింటినీ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు