‘బన్నీ – అట్లీ’ సినిమా కథా నేపథ్యం అదేనా ?

‘బన్నీ – అట్లీ’ సినిమా కథా నేపథ్యం అదేనా ?

Published on Apr 6, 2025 10:02 AM IST

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట.

ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. మొత్తానికి బన్నీ – అట్లీ నుంచి ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నట్టు జీ స్టుడియోస్ కంపెనీ, ఈ ప్రాజెక్టును నిర్మిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా, ఈ సినిమాకి సంబంధించి లీకుల రూపంలో చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఉందనే విషయాన్ని నిర్మాత రవిశంకర్ పరోక్షంగా వెల్లడిస్తూ.. త్వరలోనే అట్లీతో బన్నీ సినిమా చేస్తారని, ఆ తర్వాత త్రివిక్రమ్ మూవీ ఉంటుందని.. ఆ 2 సినిమాలు పూర్తయిన తర్వాత పుష్ప-3 వస్తుందని రవిశంకర్ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు