నాగ్ ‘బంగార్రాజు’లో అఖిల్ కూడానా ?

Published on Nov 29, 2020 10:45 pm IST

నాగార్జున సినిమాలో అక్కినేని అఖిల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడా.. ? ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ఇదే టాక్ వినిపిస్తోంది. అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కూడా ఒకటి. ముఖ్యంగా నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జునతో ఆ సినిమాకి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ.. అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. కానీ డిసెంబర్ మూడో వారం నుండి ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే..

అయితే తాజాగా వస్తోన్న రూమర్ ప్రకారం అఖిల్ ఈ సినిమాలో ఓ కీ రోల్ లో నటించబోతున్నాడట. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. కాగా ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నాడట. ఇప్పటికే ట్యూన్స్ కూడా పూర్తయ్యాయట. మొత్తానికి ‘బంగార్రాజు’ రాక ఆలస్యం అయినా, ఆసక్తి ఉండేలా ఉంది. ఎలాగూ ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

సంబంధిత సమాచారం :

More