నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై బోయపాటి కసరత్తులు చేస్తున్నారట. మరోవైపు లొకేషన్స్ ను కూడా ఇప్పటికే బోయపాటి ఫైనల్ చేశాడు. జనవరి మూడో వారం నుంచి ఆఖండ పాత్రకు సంబంధించిన ఎంట్రీ సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఇందులో భాగంగానే బాలయ్య ఇంట్రో కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి ఈ సినిమా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.