డైరెక్టర్ క్రిష్, అనుష్క ప్రధాన పాత్రలో ‘ఘాటీ’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఐతే, ‘ఘాటీ’లో మరో అతిథి పాత్రలో ఉందని, ఆ పాత్రలో ఓ హీరో నటిస్తున్నాడని ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. కాగా తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఆ పాత్రలో రానా కనిపిస్తున్నాడని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఇక ఇప్పటికే, 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్ రెడీ మొదలైంది.
కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. ఇక ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఘాటీ అమెజాన్ లోకి రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.