బాలయ్య సినిమాలో మరో హీరోయిన్ ?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, తాజాగా ఈ సినిమాలో ‘KGF’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఓ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీనిధి తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ అనే మూవీ చేస్తోంది. మరి ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

అన్నట్టు ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.

Exit mobile version