నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ను శరవేగంగా షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్యతో పాటు ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్. పైగా బాలయ్యతో పాటు బాబీ డియోల్ లుక్ కూడా చాలా వైల్డ్ గా ఉంటుందట.
అందుకే, సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్స్ లో ఈ క్లైమాక్స్ సీక్వెన్సే హైలైట్ గా ఉంటుందట. ఏది ఏమైనా ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.