‘విశ్వంభర’ పై లేటెస్ట్ అప్ డేట్

‘విశ్వంభర’ పై లేటెస్ట్ అప్ డేట్

Published on Feb 26, 2024 12:05 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పై వచ్చే ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లోని విజువల్స్ ఆదరిపోతాయని, అలాగే.. మెగాస్టార్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

అన్నట్టు రీసెంట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుంది అని, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుంది అని వశిష్ట చెప్పుకొచ్చాడు. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు