ఆ రోజు ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీమియర్ షోలు ?

ఆ రోజు ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీమియర్ షోలు ?

Published on Jul 23, 2024 7:40 PM IST

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే, ఓవర్సీస్‌లో ఆగస్టు 14న ప్రీమియర్ షోలు ఉంటాయని ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే, ఇదే రోజు రవితేజ నటిస్తోన్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ కూడా విడుదల కాబోతుంది. అయినప్పటికీ, ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. అన్నట్టు పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ లతో పాటు మరో నిర్మాతగా, విషు రెడ్డి సీఈవోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్‌ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మరి, డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు