ఎన్టీఆర్ ‘దేవర’ పై లేటెస్ట్ అప్ డేట్

ఎన్టీఆర్ ‘దేవర’ పై లేటెస్ట్ అప్ డేట్

Published on Jul 1, 2024 6:56 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ప్రస్తుతం ఈ సినిమాలోని బ్యాలెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఘాట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కనిపిస్తారట. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక, తారక్ – జాన్వీ కపూర్ లపై బ్యాలెన్స్ సాంగ్ ఘాట్ కూడా పూర్తి చేస్తే.. ఇక దేవర పార్ట్ 1 టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవుతుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమా కాకుండా ప్రస్తుతం హృతిక్ రోష‌న్‌ తో కలిసి మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’లో కూడా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు