‘దేవర’ షూటింగ్ పై కొత్త అప్ డేట్

‘దేవర’ షూటింగ్ పై కొత్త అప్ డేట్

Published on Jun 23, 2024 9:39 PM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ కి సంబధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాల షూటింగ్‌ జరగనుంది. క్లైమాక్స్ ఘాట్ తర్వాత ఈ సినిమాలోని బ్యాలెన్స్ సాంగ్ ఘాట్ ను ఫినిష్ చేస్తారట. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ స్టెప్స్ అదిరిపోతాయని.. ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి ఈ సాంగ్ ఫుల్ కిక్ ఇస్తోందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు