‘కల్కి’ అతిథుల పై క్లారిటీ

‘కల్కి’ అతిథుల పై క్లారిటీ

Published on Jun 16, 2024 3:57 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌ లో రాబోతున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఐతే, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో నిర్వహించనున్నట్లు టాక్. పైగా ఈ ఈవెంట్‌కు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ లతో పాటు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్‌ లు కూడా స్పెషల్ గెస్ట్ లుగా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ తమ శాఖల పై జరుపుతున్న సమీక్షలు కారణంగా ఈ ఈవెంట్ కు రావడం లేదట.

అన్నట్టు కల్కి ఓపెనింగ్స్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీనికితోడు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో కల్కి టికెట్ రేట్ల పెంపు విషయంలో, అలాగే స్పెషల్ షోల విషయంలో కూడా ఎలాంటి షరతులు ఉండవు. చంద్రబాబుతో కల్కి నిర్మాత అశ్వనీదత్ కు మంచి అనుబంధం ఉంది. కాబట్టి, ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను కల్కి చాలా ఈజీగా బ్రేక్ చేస్తుందని టాక్ నడుస్తోంది. ఈ భారీ-బడ్జెట్ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు