‘ఇండియన్ 2’లో రకుల్ పాత్ర అదే !

‘ఇండియన్ 2’లో రకుల్ పాత్ర అదే !

Published on May 16, 2024 9:03 PM IST

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఐతే, రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఇండియన్ 2 లో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించేది కొన్ని సన్నివేశాలు మాత్రమే. అది కూడా సెకండ్ హాఫ్ లో. ఐతే, రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర సినిమాలో కొద్ది సమయం మాత్రమే ఉన్నా.. చాలా కీలకంగా ఉండబోతుందని.. ఓ సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఆమె పాత్ర సాగుతుందని తెలుస్తోంది.

ఇక భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు, కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. సిద్ధార్థ్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు