ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ‘రాజావారు’ హీరో !

ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ‘రాజావారు’ హీరో !

Published on Mar 31, 2020 6:50 AM IST

‘రాజావారు రాణిగారు’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సివాలా చిత్రంతో ఆకట్టుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పైన ‘ SR కళ్యాణమండపం – Est. 1975 ‘ అనే చిత్రం రూపొందుతోంది. ఎలైట్ గ్రూప్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఒక కళ్యాణమండపం చుట్టూ జరిగే క‌థ‌తో ఎంతో ఆస‌క్తిగా రూపొందుత‌ని, రాయలసీమ నేపథ్యంలో సాగే వినోదాత్మక అంశాలున్న కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ హీరో తండ్రి పాత్ర పూర్తి పోషిస్తున్నారు. ఇక త‌న కెరీర్ లో తొలిసారిగా సాయికుమార్ పూర్తిగా రాయలసీమ మాండలికం, వ్యావహారిక శైలిని అనుసరించనున్నారట‌, అలానే తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని గొప్పగా చూపించే ప్ర‌య‌త్నం ఈ సినిమాలో చేస్తున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు