‘సర్కారు వారి పాట’ ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ అక్కడే !

‘సర్కారు వారి పాట’ ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ అక్కడే !

Published on Nov 23, 2020 12:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఓ సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మించారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం ఈ సెట్ లోనే షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఈ ఇంటర్వెల్ సన్నివేశాలు చాలా కీలకమైనవి అట. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగుతోందట.

ఇక ఈ సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు కూడా ఉన్నాయని.. అలాగే ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుందని తెలుస్తోంది. అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌ గా కనిపించబోతున్నాడు. ఈ లవర్ బాయ్ లుక్ కోసమే, మహేష్ తన హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మార్చుకున్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు