మనోజ్ కోసం నటిస్తోన్న ఆ స్టార్ హీరో ఎవరో ?

మనోజ్ కోసం నటిస్తోన్న ఆ స్టార్ హీరో ఎవరో ?

Published on Nov 29, 2020 11:42 PM IST

మంచు మనోజ్‌ కొత్త సినిమా ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉందని.. క్లైమాక్స్ లో వచ్చే ఆ రోల్ లో ఓ స్టార్ హీరో నిముషం పాటు కనిపించనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి మనోజ్ కోసం నటిస్తున్న ఆ స్టార్ హీరో ఎవరు అనేది చూడాలి. ఇక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ లో ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ కంపోజింగ్ లో భారీ ఫైట్ సీక్వెన్సెస్ ను పూర్తి చేశారు. ఆ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.

ఇక ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తాడు మనోజ్. ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు