అక్కినేని నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. విరూపాక్ష సినిమాతో కార్తీక్ దండు మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకే, ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఐతే, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగ చైతన్య డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారని.. నాగ చైతన్య రెండు పాత్రల్లో ఒక పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని.. ఈ పాత్రలో చైతు లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.
మరి నాగ చైతన్య న్యూ మేకోవర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. పూజా హెగ్డే ఈ చిత్రంలో నాగ చైతన్యతో కలిసి నటించబోతోందట. పూజా హెగ్డే – చైతు మధ్య లవ్ స్టోరీ కూడా చాలా ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. అన్నట్టు అక్టోబర్ నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) నిర్మించబోతుంది. కాగా ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి డైరెక్షన్ లో రాబోతున్న భారీ చిత్రం “తండేల్”.