క్లైమాక్స్ లో ‘దేవర’ ఊచకోత

క్లైమాక్స్ లో ‘దేవర’ ఊచకోత

Published on Sep 8, 2024 9:20 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘దేవర పార్ట్ 1’ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటివరకు బయటకు వచ్చిన దేవర ప్రమోషనల్ కంటెంట్ అద్భుతంగా ఆకట్టుకుంది. ఐతే, దేవర పార్ట్ 1 క్లైమాక్స్ పై ఓ న్యూస్ వినిపిస్తోంది.

మొదటి పార్ట్ 1 లకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సినిమాల క్లైమాక్స్ లు ఒక ఎత్తు అయితే, దేవర క్లైమాక్స్ మరో ఎత్తు అని తెలుస్తోంది. యాక్షన్ అభిమానులకు ఈ సినిమా క్లైమాక్స్ ఓ ఫీస్ట్ అట. ముఖ్యంగా దేవర ఊచకోతకు వెన్నులో వణుకు పుడుతుందని, బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామీ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో చూడాలి.

కాగా ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు