మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్. మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. 2019లో వచ్చిన ఈ మలయాళ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రెడీ కాబోతుంది. లూసిఫర్ మూవీకి కొనసాగింపుగా ‘L2E: ఎంపిరాన్’ అనే చిత్రం మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబోలో రాబోతుంది.
ఇప్పటికే, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సీక్వెల్ షూట్ ను కూడా స్టార్ట్ చేశాడని తెలుస్తోంది. కాగా మార్చి నుంచి మేకర్స్ యూఎస్ షెడ్యూల్ షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారట. లూసిఫర్ సినిమాలో పృథ్వీరాజ్ చెప్పాలనుకున్న స్టోరీ థీమ్ బాగుంది. సినిమా నిండా ఎమోషన్ ఉన్నాయి. ముఖ్యంగా మోహన్ లాల్, వివేక్ ఒబెరాయ్ మరియు మంజు వారియర్ పాత్రలు కూడా చాలా బాగా హైలైట్ అయ్యాయి. మరి ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో చూడాలి.