ప్రభాస్ లేకుండానే ‘సలార్-2’ షూటింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రం ‘సలార్’. ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. దీంతో, సలార్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే, ‘సలార్-2’ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. కాకపోతే, ప్రభాస్ లేకుండానే ఈ షూటింగ్ జరగనుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, నటుడు బాబీ సింహా, శ్రియా రెడ్డి, జగపతిబాబు ల పై ఈ షూటింగ్ స్టార్ట్ కానుంది. సలార్ 2 మొదటి రెండు షెడ్యూల్స్ లో ప్రభాస్ జాయిన్ కాడు అని తెలుస్తోంది.

మూడో షెడ్యూల్ నుంచి ప్రభాస్ పార్ట్ ను షూట్ చేస్తారట. పార్ట్ 2 సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆ మధ్య సలార్ 2 సినిమా నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సినిమా పార్ట్-2ని స్టార్ట్ చేసి.. 2025లో రిలీజ్‌ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన తెలిపారు. అన్నట్టు సలార్ పార్ట్ 1 మూవీ రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.

Exit mobile version