‘సరిపోదా శనివారం’ ఏ రేంజ్ సక్సెసో ?

‘సరిపోదా శనివారం’ ఏ రేంజ్ సక్సెసో ?

Published on Aug 26, 2024 10:00 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ‘సరిపోదా శనివారం’ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి.
దీంతో, ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగష్టు 29వ తేదీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఓవర్సీస్‌లో ఆగస్టు 28న ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆగష్టు 29 ఎర్లీ మార్నింగే షోలు పడబోతున్నాయి. ఐతే, ఈ షోల టికెట్స్ కోసం ఫ్యాన్స్ పోటీ పడేలా ఉందట పరిస్థితి.

సహజంగా టాప్ లీడ్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాలకే ఇంత భారీగా హడావుడి ఉంటుంది. ఈ లెక్కన నాని కూడా టాప్ లీడ్ లో చేరిపోయినట్టే. ఎలాగూ సరిపోదా శనివారం పై మంచి అంచనాలు ఉన్నాయి. టాక్ కూడా పాజిటివ్ గా వస్తే.. నాని స్టార్ డమ్ కి మరింతగా కలిసిరానుంది. పైగా ఈ సినిమా నాని కెరీర్‌ లోనే అత్యధిక వసూళ్లు రాబడుతుందని అంటున్నారు. మరి, సరిపోదా శనివారం ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాబోతుంది. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు