అక్కినేని నాగచైతన్య, అందాల భామ శోభిత ధూళిపాళ్ల ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి తర్వాత ఈ జోడీ బయట చాలా తక్కువగా కనిపిస్తున్నారు. కాగా ఈ ఇద్దరు స్టార్స్ పెళ్లి తర్వాత తొలి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఇక ఈ పండుగను వారు సంప్రదాయ ప్రకారం జరుపుకున్నట్లు తెలుస్తోంది. ట్రెడీషినల్ వేర్‌లో నాగచైతన్య, శోభిత ఇద్దరు కూడా చాలా చక్కగా కనిపించారు. దీనికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది.
శోభిత తో పాటు నాగచైతన్య చాలా సంతోషంగా కనిపిస్తున్న ఈ ఫోటో చూసి అభిమానులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట చూడచక్కగా ఉందంటూ వార కితాబిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.