నటి నటాషా స్టాంకోవిచ్ తో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే, తన భార్య నటాషా స్టాంకోవిచ్ కు విడాకులు ఇస్తున్నట్లు హార్దిక్ పాండ్య క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే, ఎందుకు విడిపోతున్నామనే విషయాన్ని మాత్రం ఇటు హార్దిక్ పాండ్య గానీ, అటు నటాషా గానీ వెల్లడించలేదు.
అయితే, తాజాగా వీరు విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య వ్యక్తిత్వపరంగా చాలా తేడాలున్నాయట. హార్దిక్ వ్యక్తిత్వానికి తగ్గట్లుగా ఉండేందుకు నటాషా ప్రయత్నించినా వీలు కాలేదట. జీవితాంతం ఇలానే అతడితో ఉండలేక ఒక అడుగు వెనక్కి తీసుకోవాలని ఆమె నిర్ణయించుకుందట.ఈ నిర్ణయం ఒక్క రోజులోనో లేదా వారంలో తీసుకున్న నిర్ణయం కాదు అట. ఎంతో ఆలోచించి వీరిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నారట.