‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ని తిరిగి స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ‘నిధి అగర్వాల్‌’ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ఈ ఉదయం విజయవాడకు చేరుకుంది. ‘పవన్ కళ్యాణ్ – నిధి అగర్వాల్‌’ ల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలాగే, పవన్ – నిధి పై ఈ షెడ్యూల్ లోనే ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది.

డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కాగా మార్చి 28, 2025న పాన్ ఇండియా సినిమాగా ‘హరిహర వీరమల్లు’ ఇతర భారతీయ భాషల్లో కూడా విడుదల కానుంది.

Exit mobile version