పవన్ ఫ్యాన్స్ రేంజ్…గాసిప్ ని కూడా ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తున్నారు

పవన్ ఫ్యాన్స్ రేంజ్…గాసిప్ ని కూడా ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తున్నారు

Published on Nov 22, 2020 12:05 AM IST

పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటిసారి పీరియాడిక్ డ్రామా చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.పవన్ 27వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ లాక్ డౌన్ కి ముందు షూటింగ్ ప్రారంభమైంది. ఐతే లాక్ డౌన్ తరువాత మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళలేదు.మొగలుల కాలం నేపథ్యంలో సాగే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్ర చేస్తున్నారు. పేదల కోసం రాజుల ఖజానాలు దోచే వీరుడిగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.

ఇక ఈ చిత్రం కోసం విరూపాక్ష, బందిపోటు, గజదొంగ వంటి కొన్ని టైటిల్స్ వినిపిస్తున్నాయి. పవన్ బర్త్ డే కానుకగా పవన్ ప్రీ లుక్ విడుదల చేయగా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.కాగా ఈ మూవీలో హీరోయిన్ పై క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ హిట్ అందుకున్న నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందట. పవన్ 27వ మూవీలో హీరోయిన్ నిధి అగర్వాల్ అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. దీనిపై అధికారికమైన ప్రకటన లేకున్నప్పటికీ ఇండియా వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,భారీ అంచాలనున్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేస్తున్న పవన్ వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు