ఆ డైరెక్టర్లతో చంద్రబాబు, పవన్ ల ప్రమాణ స్వీకారం కి అటెండ్ అయిన నిఖిల్!

ఆ డైరెక్టర్లతో చంద్రబాబు, పవన్ ల ప్రమాణ స్వీకారం కి అటెండ్ అయిన నిఖిల్!

Published on Jun 12, 2024 6:26 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చివరిసారిగా స్పై చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తదుపరి స్వయంభు చిత్రంలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ హీరో నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల ప్రమాణ స్వీకారం కి అటెండ్ అయ్యారు.

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మరియు మెహర్ రమేష్ లతో నిఖిల్ సిద్ధార్థ్ ఉన్న ఫోటోను మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం పట్ల సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు