పైరసీ పై నిఖిల్ ఆవేదన వర్ణనాతీతం..!

Published on Dec 8, 2019 2:16 pm IST

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ సురవరం మూవీకి హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో నిఖిల్ తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం ప్రదర్శించబడుతున్న ప్రదేశాలను, థియేటర్లను సందర్శిస్తూ అభిమానులను కలుసుకుంటున్నారు. నిన్న గుంటూరు వెళ్లిన నిఖిల్ రోడ్డు ప్రక్కనే బహిరంగంగా పైరసీ సీడీలు అమ్ముతున్న విషయం గమనించి షాక్ కి గురయ్యాడు. అనేక వ్యయప్రయాసలకోర్చి వేలమంది కష్టపడితే ఒక సినిమా తయారవుతుంది. అలాంటి సినిమా పైరసీ సీడీలను ఇలా రోడ్లపై అమ్మేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నాళ్ళకు సినిమా చచ్చిపోతుందని ఆందోళన పడ్డారు. ఆ పైరసీ సీడీలు అమ్ముతున్న మహిళ దీనగాథను విన్న నిఖిల్, ఇలాంటి వాళ్ళను ఏమి చేయగలం అని అక్కడ నుండి వెళ్లిపోయారు. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియోని నిఖిల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అర్జున్ సురవరం మూవీని టి సంతోష్ తెరకెక్కించగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :

X
More