నిఖిల్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేస్తోంది!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ‘కార్తికేయ-2’ తరువాత ఒక్కసారిగా పాన్ ఇండియా ఆడియెన్స్ దృష్టిలో పడ్డ ఈ యంగ్ హీరో ఇప్పుడు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఇక నిఖిల్ నటిస్తున్న ఓ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అక్టోబర్ 6న రానున్నట్లు మేకర్స్ తెలిపారు.

నిఖిల్ కెరీర్‌లో ‘స్వామి రా రా’ ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఆ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేశాడు. అయితే, ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ఆదివారం రోజున రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ చిత్రంతో రుక్మిణి వసంత్ తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. దివ్యాంశ కౌషిక్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది.

Exit mobile version