నార్త్ లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసిన ‘కార్తికేయ – 2’ మేకర్స్

Published on Aug 12, 2022 11:00 pm IST

నిఖిల్ సిద్దార్థ లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 రేపు భారీ స్థాయిలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించగా కాల భైరవ మ్యూజిక్ అందించారు. అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫితో పాటు ఎడిటర్ గా కూడా వర్క్ చేశారు.

అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచిన కార్తికేయ 2 మూవీ తెలుగు తో పాటు హిందీ వర్షన్ లో కూడా రేపు రిలీజ్ అవుతోంది. హిందీ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో నార్త్ లో ఈ మూవీని 200 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా తెలుగు ఆడియన్స్ తో పాటు హిందీ ఆడియన్స్ ని కూడా ఈ మూవీ ఆకట్టుకుంటుందని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం :