నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్‌కి టైమ్ ఫిక్స్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా, అంచనాలు అటోమేటిక్‌గా క్రియేట్ అయ్యాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘స్వామి రారా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ రావడంతో, ఈసారి ఎలాంటి సినిమా వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ థ్రిల్లర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా నుండి మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా టీజర్‌ను దసరా కానుకగా రేపు(అక్టోబర్ 11) సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఈ మేరకు నిఖిల్ సిగరెట్ తాగుతూ వెళ్తున్న ఓ పోస్టర్‌ను వారు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర ప్రొడ్యూస్ చేస్తుండగా కార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version