మారేడుమిల్లి అడ‌వుల్లో ‘స్వ‌యంభు’ యాక్ష‌న్

మారేడుమిల్లి అడ‌వుల్లో ‘స్వ‌యంభు’ యాక్ష‌న్

Published on Jun 26, 2024 2:09 PM IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘స్వ‌యంభు’ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను భ‌ర‌త్ కృష్ణ‌మాచారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ఈ మూవీపై మంచి బ‌జ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాలోని ప‌లు కీల‌క స‌న్నివేశాల‌తో పాటు యాక్ష‌న్ సీన్స్ ను మారేడుమిల్లి అడ‌వుల్లో చిత్రీక‌రిస్తున్నారు. ఈ షూటింగ్ లో నిఖిల్ తో పాటు ప‌లువురు కీల‌క న‌టీన‌టులు పాల్గొంటున్న‌ట్లుగా మేక‌ర్స్ తెలిపారు.

‘స్వ‌యంభు’ చిత్రంలో సంయుక్తా మీన‌న్, న‌భా న‌టేష్ లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం అందిస్తుండ‌గా.. పిక్సెల్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై భువన్, శ్రీ‌క‌ర్ లు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు