ఇంట‌ర్వ్యూ: ‘నింద’ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది – రాజేష్ జ‌గ‌న్నాథం

వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘నింద’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని రాజేష్ జ‌గ‌న్నాథం స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించారు. య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కాగా, జూన్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ‘నింద’ మూవీ గురించిన ప‌లు విష‌యాల‌ను ద‌ర్శ‌క‌నిర్మాత రాజేష్ జ‌గ‌న్నాథం మీడియాతో పంచుకున్నారు.

మీ సినీ ప్ర‌యాణం గురించి చెప్పండి..?

నేను యూఎస్ లో ఉద్యోగం చేస్తున్న స‌మ‌యంలో ఫిల్మ్ మేకింగ్ లో కోర్సులు చేశాను. అక్క‌డే చిన్న షార్ట్ ఫ‌ల్మ్స్ కూడా చేశాను. ఓ షార్ట్ ఫిల్మ్ కి అక్క‌డ అవార్డు ల‌భించింది. దీంతో ఎలాగైనా సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను.

‘నింద’ సినిమాలో వ‌రుణ్ సందేశ్ నే హీరోగా ఎందుకు తీసుకున్నారు..?

ఈ సినిమాలోని హీరో క్యారెక్ట‌ర్ వ‌రుణ్ సందేశ్ కి ప‌ర్ఫెక్ట్ గా సెట్ అవుతుంద‌ని భావించాను. ఆయ‌న‌కు కూడా ఇది మంచి క‌మ్ బ్యాక్ మూవీ అవుతుంద‌ని నమ్మాను. అందుకే, ఆయ‌న‌కు క‌థ వినిపించ‌గానే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఈ సినిమా క‌థ క‌ల్పితమా.. లేక నిజ‌మా..?

‘నింద – కాండ్ర‌కోట మిస్ట‌రీ’ అని ఈ మూవీ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌గానే, అందరూ ఇది ఘోస్ట్ మూవీ అని అన్నారు. స‌ర్లే.. ఏదో విధంగా సినిమాకు ప్ర‌మోష‌న్ వ‌స్తుంద‌ని అనుకున్నా. ఇక టీజ‌ర్ రిలీజ్ చేశాక‌, అంద‌రికీ ఓ క్లారిటీ వ‌చ్చింది. ఈ సినిమాలో కొన్ని వాస్త‌విక ఘ‌ట‌న‌లు ఉండ‌గా, కొన్ని క‌ల్పిత ఘ‌ట‌న‌లు ఉన్నాయి.

ఈ సినిమాను మీరే ఎందుకు ప్రొడ్యూస్ చేశారు..?

ఈ మూవీ క‌థపై నాకు న‌మ్మ‌కం ఉంది. దీంతో నిర్మాత‌ల కోసం ప్ర‌య‌త్నించాను. కానీ వేరే వాళ్లు ఎందుక‌ని, నా సినిమాను నేనే ప్రొడ్యూస్ చేసుకోవాల‌ని అనుకున్నాను.

ఈ చిత్ర టెక్నిక‌ల్ టీమ్ గురించి చెప్పండి..?

ప్ర‌ముఖ సినిమాటోగ్ర‌ఫ‌ర్ పీఎస్.వినోద్ గారి వ‌ద్ద అసిస్టెంట్ గా చేసిన ర‌మిజ్ మా సినిమాకు కెమెరామెన్ గా ప‌నిచేశారు. ఓంకార్ మంచి ఆర్ఆర్ తో పాటు మ్యూజిక్ ను అందించారు. టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు మేజ‌ర్ అసెట్ గా నిలిచారు.

ఈ సినిమా ఎలా ఉండ‌బోతోంది..?

కంటెంట్ బేస్డ్ చిత్రాలు అన‌గానే మ‌న‌కు మ‌ల‌యాళ సినిమాలు గుర్తొస్తాయి. మ‌న‌ద‌గ్గ‌ర ఇలాంటి సినిమాలు ఎందుకు రావ‌ని అనుకుంటారు. కానీ, ‘నింద’ సినిమా చూశాక‌, మన వద్ద కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి.. ఇదేదో బాగానే ఉందే.. బాగా తీశారే.. అని అనుకుంటారు. ఈ సినిమా అందరినీ ఆక‌ట్టుకుంటుంది.

మీ నెక్ట్స్ చిత్రాలు ఏమైనా ఉన్నాయా..?

ప్ర‌స్తుతం నా ద‌గ్గ‌ర కొన్ని బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ‘నింద’ రిలీజ్ అయ్యి, రిజ‌ల్ట్ చూశాక నా నెక్ట్స్ ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టిస్తాను. ఇక‌పై ద‌ర్శ‌క‌త్వంపైనే ఫోక‌స్ పెడ‌తాను.

Exit mobile version