సమీక్ష : “నింద” – రోటీన్ ప్లేతో సాగే ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : “నింద” – రోటీన్ ప్లేతో సాగే ఎమోషనల్ డ్రామా !

Published on Jun 22, 2024 3:02 AM IST
Nindha Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 21, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: వరుణ్ సందేశ్, అన్నీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ కృష్ణ, రాజ్ కుమార్ కుర్ర, దుర్గా అభిషేక్ తదితరులు

దర్శకుడు: రాజేష్ జగన్నాధం

నిర్మాత : రాజేష్ జగన్నాధం

సంగీత దర్శకుడు: సంతు ఓంకార్

సినిమాటోగ్రఫీ: రమీజ్ నవీత్

ఎడిటింగ్: అనిల్ కుమార్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన పలు చిన్న చిత్రాల్లో నటుడు వరుణ్ సందేశ్ హీరోగా రాజేష్ జగన్నాథం కాంబినేషన్ లో చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ “నింద” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

కాండ్రకోట అనే ఊరిలోని ముంజు అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ హత్య బాలరాజు(ఛత్రపతి శేఖర్‌) చేశాడని కోర్ట్ లో నిరూపితం కావడంతో జడ్జ్ సత్యానంద్‌(తనికెళ్ల భరణి) ఇష్టం లేకపోయినా ఉరిశిక్ష వేస్తాడు. అసలు సత్యానంద్‌ ఎందుకు అలా ఫీల్ అయ్యాడు ?, బాలరాజు హత్య చేయలేదు అని సత్యానంద్ ఎలా నమ్మాడు ?, చనిపోయిన సత్యానంద్‌ కోసం అతని కొడుకు వివేక్‌(వరుణ్‌ సందేశ్‌) ఏం చేశాడు ?, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్ కమిషనర్‌గా పనిచేస్తున్న వివేక్, బాలరాజుకి న్యాయం చేశాడా ? లేదా ?, అసలు బాలరాజు (ఛత్రపతి శేఖర్) పైకి ఈ నేరం ఎలా వచ్చింది ?, ఇంతకీ అసలైన నిందితులు ఎవరు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

న్యాయపోరాటాన్ని ఆవిష్కరించే చిత్రం ఇది. వాస్తవిక కథతో పాటు కొన్ని సీన్స్ ఆసక్తిగా సాగడంతో ఈ నింద సినిమా పై మొదట్లో బాగానే ఆసక్తి పెరిగింది. ఏ తప్పు చెయ్యనివారికి అన్యాయంగా శిక్ష పడితే, వారి జీవితాలు ఎలా నాశనం అవుతాయి ? అనే కోణంలో సాగిన ఈ సినిమా కొన్ని చోట్ల ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. కొంతమంది పోలీసులు ప్రవర్తన, కొందరి రాజకీయ నాయకుల ఒత్తిడికితో వాళ్ళు అమాయకులను ఎలా బుక్ చేస్తారనే అంశాలను సినిమాలో బాగానే చూపించారు.

ఇక తన నటనతో వరుణ్ సందేశ్ ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ప్రధాన పాత్రలో నటించిన అన్నీ కూడా చాలా బాగా నటించింది. మరో కీలక పాత్రలో నటించిన తనికెళ్ల భరణి తన నటనతో మెప్పించాడు. మరో కీలక పాత్రలో నటించిన చత్రపతి శేఖర్ కూడా బాగా నటించాడు. ఇతర ప్రధాన పాత్రల్లో భద్రమ్, సూర్య కుమార్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఆకట్టుకున్నారు. అలాగే మిగిలిన నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్, వారి నటన బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

రాజేష్ జగన్నాధం దర్శకత్వ పనితనం బాగున్నా.. అతను తీసుకున్న స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో సినిమా ఫలితం దెబ్బతింది. సినిమాలో చెప్పుకోవడానికి గుడ్ పాయింట్ ఉన్నా, చాలా సీక్వెన్స్ లు ఇంట్రస్ట్ గా సాగలేదు. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో చాలా భాగం మ్యాటర్ లేని సీన్లతో, వర్కౌట్ కాని విచారణ డ్రామాతో సాగింది. దీనికి తోడు అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశారు.

కథ అవసరానికి మించిన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. అలాగే కథ పరంగా వచ్చే కొన్ని కీలక సీన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో ల్యాగ్ సీన్స్ తో మంచి ఎమోషనల్ సీక్వెన్స్ ను రాసుకున్నా.. అవి కూడా పూర్తి సినిమాటిక్ గా సాగాయి. ఓవరాల్ గా దర్శకుడు రాజేష్ జగన్నాధం స్క్రిప్టు విషయంలో ఇంకా ఎఫెక్టివ్ గా వర్క్ చేసి ఉంటే బాగుండేది. అలాగే సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ ను ఇంకా బెటర్ గా రాసుకుని ఉండాల్సింది.

సాంకేతిక విభాగం:

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. రమీజ్ నవీత్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా చిత్రీకరించారు. అనిల్ కుమార్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక సంగీత దర్శకుడు సంతు ఓంకార్ సమకూర్చిన నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగానే ఉన్నాయి.

తీర్పు:

నింద అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ క్రైమ్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఐతే, కథనంలో కొన్ని చోట్ల ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడం, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ప్లే బోర్ గా సాగడం, సినిమాలో ముఖ్యమైన కొన్ని సీక్వెన్స్ లో లాజిక్ మిస్ కావడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ గా నిలిచాయి. మొత్తమ్మీద ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ మాత్రం ఆకట్టకుంటాయి. వరుణ్ సందేశ్ నుంచి డిఫరెంట్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు