‘నింద’ మూవీ వ‌రుణ్ కెరీర్ కు మైల్ స్టోన్ లా మారాలి – నిఖిల్ సిద్ధార్థ్

‘నింద’ మూవీ వ‌రుణ్ కెరీర్ కు మైల్ స్టోన్ లా మారాలి – నిఖిల్ సిద్ధార్థ్

Published on Jun 17, 2024 8:12 AM IST

Nindha Movie To Be A Milestone For Varun Sandesh Says Nikhil Siddharth

వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నింద’ ఇప్పటికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను జూన్ 21న రిలీజ్ చేస్తున్నట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘ‌నంగా నిర్వ‌హించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గెస్టుగా వచ్చారు.

ఈ సంద‌ర్బంగా నిఖిల్ మాట్లాడుతూ.. “నా కెరీర్ లో స్వామిరారా, కార్తికేయ సినిమాలు ఎలా మైల్ స్టోన్ గా నిలిచాయో, వ‌రుణ్ కెరీర్ కు ‘నింద’ కూడా అలా మారాలి. ఈ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలి. ఈ సినిమాను చాలా క్వాలిటీతో తెర‌కెక్కించారు. అంద‌రూ ఈ సినిమాను చూసి ఆద‌రించాలి. అని అన్నారు.

ఇక వ‌రుణ్ సందేశ్ మాట్లాడుతూ.. “నిఖిల్ గ్రోత్ చూసి నాకు ఎంతో గ‌ర్వంగా ఉంది. నేను, నిఖిల్ క‌లిసి 2007లో ‘హ్యాపీ డేస్’ చేశాం. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు ఇలా ఒక స్టేజీపై క‌లిశాం. ‘నింద’ నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. ఎంతో కంఫర్టబుల్‌గా జీవితాన్ని గడుపుతున్న రాజేష్ తన ప్యాషన్‌తో ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ సినిమా క‌థ‌పై పూర్తి న‌మ్మ‌కం ఉంది. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ.. నెక్స్ట్ ‘నింద’ అని గర్వంగా చెప్పుకోగలను..” అని పేర్కొన్నారు.

దర్శక, నిర్మాత రాజేష్ జగన్నాథం మాట్లాడుతూ.. “ఈ సినిమా ఔట్ పుట్ చూసి చాలా సంతృప్తి చెందాను. ఈ సినిమాతో నాకు ఓ మంచి బ్ర‌ద‌ర్ దొరికాడు. మ్యూజిక్ డైరెక్టర్ సాంతు, ఎడిటర్ అనిల్, కెమెరామెన్ రమీజ్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్స్. సినిమా అద్భుతంగా రావ‌డంలో వారు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమా ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చుతుందని న‌మ్ముతున్నా..” అని అన్నారు.

శ్రేయా రాణి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో ఆనీ, మ‌ధు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జ‌గ‌న్నాథం ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు