‘క‌ల్కి’తో తెరుచుకున్న నితిన్ మ‌ల్టీప్లెక్స్

‘క‌ల్కి’తో తెరుచుకున్న నితిన్ మ‌ల్టీప్లెక్స్

Published on Jun 27, 2024 9:39 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ విజువ‌ల్ వండ‌ర్ మూవీ క‌ల్కి 2898 AD బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ములేపుతోంది. రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ మూవీకి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ ల‌భిస్తుండ‌టంతో మేక‌ర్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈవారం క‌ల్కి మూవీ ఒక‌టే రిలీజ్ అవడంతో, దాదాపు అన్ని థియేట‌ర్ల‌లో ఈ మూవీనే క‌నిపిస్తోంది.

కాగా, ఈ మూవీతో మ‌రో యంగ్ హీరో నితిన్ త‌న కొత్త మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ ను ఓపెన్ చేశాడు. నితిన్ కు గతంలో సితార అనే థియేట‌ర్ ఉంది. ఇప్పుడు దాన్ని రినోవేట్ చేసి ఏషియ‌న్ సినిమాస్ తో క‌లిసి ANS నితిన్ సితార మ‌ల్టీప్లెక్స్ గా ప్రారంభించాడు. తెలంగాణ‌లోని సంగారెడ్డి ఈ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ ను నితిన్ ప్రారంభించాడు.

ఇప్ప‌టికే టాలీవుడ్ లో మ‌హేష్ బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అల్లు అర్జున్, ర‌వితేజ లు మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ లో ఉన్నారు. ఇప్పుడు వారి స‌ర‌స‌న నితిన్ కూడా జాయిన్ అయ్యాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు