‘గేమ్ ఛేంజర్’ షిఫ్ట్ అవడంతో ట్రాక్‌లోకి ‘రాబిన్‌హుడ్’

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్ర రిలీజ్ డేట్‌పై నెలకొన్న అనుమానాలకు నేడు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాను తొలుత క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ భావించినా, ఇప్పుడు సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇఛ్చేశారు. దీంతో క్రిస్మస్‌కు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు మరికొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి.

ఈ క్రమంలో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ చిత్రాన్ని కూడా క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్లుగా డిసెంబర్ 20న తమ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వారు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ‘గేమ్ ఛేంజర్’ షిఫ్ట్ కావడంతో ఆ స్లాట్‌ను వెంటనే ‘రాబిన్ హుడ్’ బుక్ చేసుకున్నాడు.

ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా, వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జివి.ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version