టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మాచర్ల నియోజకవర్గం విడుదలై 3 నెలలకు పైగా అయ్యింది. థియేటర్ల లో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇంకా ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. ఆశ్చర్యకరంగా, సోనీ మ్యాక్స్ ఛానల్ ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను హిందీలో ప్రకటించింది.
మాచర్ల చునావ్ క్షేత్రం (MCK) పేరుతో ఈ చిత్రం డిసెంబర్ 11, 2022న రాత్రి 8 గంటలకు ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు. మరోవైపు, నితిన్ అభిమానులు ఈ చిత్రం డిజిటల్ డెబ్యూ కోసం ఎదురుచూస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో కృతి శెట్టి మరియు కేథరిన్ థెరిస్సా లు కథానాయికలు గా నటించారు. సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.