‘రాబిన్ హుడ్’ శాటిలైట్, ఓటీటీ రైట్స్ కి సాలిడ్ డీల్ !

‘రాబిన్ హుడ్’ శాటిలైట్, ఓటీటీ రైట్స్ కి సాలిడ్ డీల్ !

Published on Mar 24, 2025 1:00 PM IST

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ – శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. మార్చి 28, 2025 న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పైగా ట్రైలర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఐతే, తాజాగా ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓటీటీ హక్కులు సాలిడ్ రైట్ కి అమ్ముడుపోయాయి. నితిన్ కెరీర్ లోనే భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను కొనుక్కున్నట్టు తెలుస్తోంది. ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 (ZEE5) సొంతం చేసుకుంటే.. ‘జీ తెలుగు’ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.

కాగా థియేటర్ లో విడుదలైన కొన్ని వారాల తర్వాత ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రీమియర్ అవ్వనుంది. మొత్తానికి ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న ప్రమోషన్స్ సహా కంటెంట్ మంచి హిట్ కూడా అయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇంతకీ, ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు