భీష్మ సక్సెస్ మీట్ లో ఎమోషనలైన నితిన్ !

భీష్మ సక్సెస్ మీట్ లో ఎమోషనలైన నితిన్ !

Published on Feb 25, 2020 2:06 PM IST

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్ గా వచ్చిన భీష్మ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది. నితిన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధిస్తుంది. మొదటి రెండు రోజులలోనే భీష్మ ఆంధ్రా మరియు తెలంగాణాలలో కలిపి 10.52 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా నితిన్ కి ఈ సినిమా భారీ హిట్ ను అందించింది.

ఈ సందర్భంగా మేకర్స్ ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ మాట్లాడుతూ నితిన్ కాస్త ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్‌లో అతి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకి కుడుములకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో, వెంకీ తన విమర్శకులకు తన శైలిలో సరైన సమాధానం చెప్పాడని నితిన్ తెలిపాడు. త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న నితిన్ కి భీష్మ సినిమా రూపంలో గుర్తుపెట్టుకునే హిట్ వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు