తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జయలలితగారి పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తోంది.
కాగా ‘ది ఐరన్ లేడీ’ నుండి ఈ రోజే జయలలిత పాత్రలో ఉన్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ లుక్ లో నిత్యా మీనన్ అచ్చం జయలలిత లాగా ఉండటంతో ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక్కసారిగా సినిమా పై కూడ క్రేజ్ బాగా పెరుగుతుంది.
ఇక జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే నిత్యామీనన్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని దర్శకనిర్మాతలతో అమ్మ అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి జయలలిత పాత్రలో నిత్యామీనన్ ఎలా నటిస్తుందో చూడాలి.